స్వీట్లు ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలు ఇవే!

స్వీట్లు నచ్చని వారు దాదాపు ఉండరు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో తీపి తింటారు.

స్వీట్లు తినకూడదు అనుకునేవారు సైతం, కొన్ని రోజులు ఆగి, మళ్లీ స్వీట్లు అతిగా తింటారు.

తీపి అనేది ఓ రకమైన మత్తు పదార్థం లాంటిది. అందువల్ల దాన్ని దూరం చేసుకోవడం కష్టం.

స్వీట్లు అతిగా తినడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

స్వీట్లు ఎక్కువగా తింటే, దంతాలు పాడవుతాయి. కుళ్లిపోతాయి.

స్వీట్లు తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

స్వీట్లు అతిగా తినేవారు, వాటిని తగ్గిస్తే, వారి ఎనర్జీ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి.

తీపి పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది.

స్వీట్ మూడ్‌ని మెరుగుపరుస్తుంది. ఐతే తినకపోతే మూడ్‌ దెబ్బతినే ప్రమాదమూ ఉంటుంది.

స్వీట్లు ఎక్కువగా తినేవారి శరీలంలో పోషకాల లోపం ఏర్పడగలదు.

స్వీట్లు మత్తు తెప్పిస్తాయి. అదే కంటిన్యూ అయితే, నిద్ర వ్యవస్థ దెబ్బతినగలదు.