సిల్క్ స్మిత సగం కొరికిన యాపిల్.. వేలంలో ఎంతకు పోయిందో తెలుసా?

80, 90వ దశకాల్లో సిల్క్ స్మిత ఒక సంచలనం. 

అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు.. సౌత్ ఇండస్ట్రీలో ఐటమ్ క్వీన్ అంటే సిల్క్ స్మిత మాత్రమే.

కేవలం 18 ఏళ్ల కెరీర్‌లోనే ఏకంగా 450 సినిమాలకు పైగా నటించిన సిల్క్ స్మిత.. 36 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకుంది. 

తెలుగు నుంచి హిందీ వరకు అన్ని భాషల్లోనూ తన సత్తా చూపించింది. స్టార్ హీరోలందరితోనూ నటించింది.

కేవలం డాన్సర్ గానే కాకుండా నటిగా కూడా సిల్క్ స్మిత మంచి గుర్తింపు సంపాదించుకుంది. 

ఇప్పటితరానికి సిల్క్ స్మిత గురించి పెద్దగా తెలియదు కానీ.. అప్పట్లో ఒక సంచలనం. ఆమె కోసమే థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులెందరో.

సిల్క్ స్మిత క్రేజ్ అప్పట్లో ఏ రేంజ్‌లో ఉండేదంటే.. సిల్క్ సగం కొరికిన యాపిల్‌ను వేలం వేస్తే.. 

ఒక వ్యక్తి ఏకంగా రూ.25000కు కొనుక్కున్నాడట. ఈ ఒక్క సంఘటన చాలదు ఆమె క్రేజ్ ఎంతో చెప్పడగానికి..

నిజానికి అప్పట్లో రూ.25 వేలంటే మాములు విషయం కాదు.

ఆపిల్ కూడా అప్పట్లో ఒక్కటి రూ. 1, రూ.2 మాత్రమే ఉండేది. 

అలా సిల్క్‌పై ఓ అభిమాని తన అభిమానాన్ని వేలు ఖర్చు పెట్టి చూపించాడు.