మీ ఇంట్లో పాత బంగారం ఉందా.. ఈ ట్రిక్స్‌తో కొత్త బంగారంలా మార్చేయండి

సాధారణంగా బంగారు నగలు కొన్నేళ్లే మెరుస్తూ ఉంటాయి.

అందుకే మళ్లీ డబ్బులు ఖర్చు చేసి వాటికి మెరుగు పెట్టిస్తుంటారు.

ఇలా డబ్బులు ఖర్చు చేసే బదులు.. మీ ఇంట్లోనే మళ్లీ కొత్త బంగారంలా మెరిపించవచ్చు.

మీ పాత‌ బంగారం కొత్త‌గా మెర‌వాలంటే మీ టూత్ పేస్ట్, బ్ర‌ష్ ఉంటే చాలు.

మీ ఆభరణాలను కాసేపు సబ్బు నీటిలో ఉంచి, ఆ తర్వాత కొద్దిగా పేస్ట్ వేసి బ్రష్ తో రుద్దండి.

తర్వాత ఒక కాటన్ వస్త్రంలో వేసి తుడవండి. ఇక.. అవి కొత్త వాటిలా మెరుస్తుంటాయి.

మరో టిప్.. హాట్ వాటర్. బంగారాన్ని గోరువెచ్చని నీటిలో ముంచండి. నగల మూలాల్లో ఉన్న మురికి, జిడ్డు తొలగిపోతుంది.

ఆ తర్వాత వాటిని సున్నితంగా బ్రష్ చేసి క్లాత్‌తో తుడవండి.డెలికేట్ నగలకు ఇలా చేయడం ఉత్తమం.