మొక్కజొన్న తింటున్నారా? మీకు 6 లాభాలు

ఈ వానాకాలంలో వేడి వేడి మొక్కజొన్న తింటే ఆ కిక్కే వేరు

కాల్చిన మొక్కజొన్నపై నిమ్మరసం వేసుకొని తింటే అదిరిపోతుంది.

కొంతమంది మొక్కజొన్న తింటే లావుగా అవుతాం అనే ఉద్దేశంతో తినరు.

నిజానికి అన్ని రకాల ఆహారాలూ తింటేనే సరైన ఆరోగ్యం లభిస్తుంది.

మొక్కజొన్నలోని ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం, బీ కాంప్లెక్స్ విటమిన్స్ మన ఇమ్యూనిటీని పెంచుతాయి.

మొక్కజొన్నలోని ఫైబర్, జీర్ణక్రియను సరిచేస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. 

జొన్నలోని ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, విటమిన్లు ఎముకలకు మేలు చేసి, కీళ్ల నొప్పుల్ని తగ్గిస్తాయి.

మొక్కజొన్నలోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ, బయో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి, గుండెను కాపాడతాయి.

జొన్నలోని యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజాలు, విటమిన్ ఏ, సీ, చర్మాన్ని కాపాడి, అలర్జీలను తగ్గిస్తాయి.

జొన్నలోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ కంటికి మేలు చేస్తాయి. చూపును సరిచేస్తాయి.

మీ ఆరోగ్య నిపుణుల సలహాలు పాటిస్తూ, మొక్కజొన్నను కావాల్సినంత తీసుకోండి.