రైల్వేలో 904 ఉద్యోగాలు..

నిరుద్యోగులకు ఇండియన్ రైల్వేస్ (Indian Railways) గుడ్‌న్యూస్ చెప్పింది.

సౌత్ వెస్ట్రన్ రైల్వే అప్రెంటిస్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తోంది. 

హుబ్బళ్లిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ సౌత్ వెస్ట్రన్ రైల్వే, మొత్తం 904 అప్రెంటీస్ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. 

అభ్యర్థులు హుబ్బళ్లి RRC అధికారిక వెబ్‌సైట్ rrchubli.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. 

జులై 3న ప్రారంభమైన అప్లికేషన్ ప్రాసెస్, ఆగస్టు 2న ముగియనుంది.

గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి 10వ తరగతి లేదా 12వ తరగతి పరీక్షల్లో కనీసం 50% మొత్తం మార్కులు పొంది ఉండాలి. 

అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

అభ్యర్థులను మెరిట్ లిస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

రైల్వే బోర్డు నియమాలు, ఆదేశాల ప్రకారం అన్ని ట్రేడ్‌లకు శిక్షణా కాలం ఒక సంవత్సరం ఉంటుంది. 

పూర్తి వివరాల కోసం RRC హుబ్బల్లి అధికారిక వెబ్‌సైట్ rrchubli.inకి వెళ్లాలి.