త్వరలో గుడ్ న్యూస్ చెప్పనున్న శ్రీముఖి..

అందాల యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

ఓ వైపు తన యాంకరింగ్‌తో అదరగొడుతూనే.. 

మరోవైపు సినిమాల్లోను నటిస్తూ కేకపెట్టిస్తోంది. 

అది అలా ఉంటే శ్రీముఖి పెళ్లిపై మరోసారి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 శ్రీముఖి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

 ఆమె కొన్నాళ్లుగా ఓ వ్యక్తిని ప్రేమిస్తోందట. 

అతడు హైదరాబాద్‌లో హోటల్ వ్యాపారంలో రాణిస్తున్నాడని తెలుస్తోంది. 

ఈ జంట గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారట.

ఈ నేపథ్యంలో పెద్దలను ఒప్పించి.. 

ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం.

కొత్త సంవత్సరంలో శ్రీముఖి గుడ్ న్యూస్ చెప్పనుందని తెలుస్తోంది.

చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో..