విద్యార్థులకు రూ.25 వేలు ఇస్తున్న కేంద్రం.. 

ఏటా కేంద్ర ప్రభుత్వం విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) పేరుతో ప్రతిభాన్వేషణ్ పరీక్ష నిర్వహిస్తోంది.

వీవీఎం పేరిట ఏటా ప్రతిభాన్వేషణ పరీక్షలు నిర్వహిస్తున్నాయి.

ప్రస్తుతం 2024-25 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.

ఆరు నుంచి ఇంటర్ వరకు గల విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు.

పోటీ పరీక్షను జూనియర్, సీనియర్ విభాగాల్లో నిర్వహిస్తారు.

6-8 తరగతులకు జూనియర్ 9-11 తరగతులకు సీనియర్ గ్రూపుగా పరీక్ష ఉంటుంది.

ఇందులో తెలుగు, హిందీ, ఇంగ్లీషు తదితరభాషల్లో పరీక్ష ఉంటుంది.

రాష్ట్ర స్థాయిలో ప్రథమ, ద్వితీ య, తృతీయ బహుమతులు వరుసగా రూ.5 వేలు, రూ.3 వేలు, 2 వేలు అందిస్తారు.

వీటితో పాటు మెమెంటో, సర్టిఫికెట్ అందజేస్తారు.

జాతీయ స్థాయి విజేతలకు రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలతో పాటు మెమెంటో, ప్రశంసాపత్రం అందజేస్తారు.