' ఆమె ' కోసం ఆరు సూపర్ ఫుడ్స్..
మగవారికి భిన్నంగా ఆడవారి (Women) శరీరం, శారీరక విధులు ఉంటాయి.
అందుకే అన్ని రకాల పోషకాలు వారికి అవసరం అవుతాయి.
మహిళలు రోజూ కొన్ని సూపర్ ఫుడ్స్ డైట్‌లో భాగం చే
సుకుంటే అందం, ఆరోగ్యం వారి సొంతమవుతుంది.
ఆ సూపర్ ఫుడ్స్ ఏవో తెలుసుకుందాం.
* బొప్పాయి :
బొప్పాయిలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉంటుంది, ఇది బ్రెస్ట్, సర్వికల్ క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
* పప్పు ధాన్యాలు :
బరువును తగ్గించుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
* అవిసె గింజలు :
ఆడవారిలో ఎక్కువగా తలెత్తే బ్రేస్ట్ క్యాన్సర్ నుంచి సంరక్షిస్తాయి.
* యోగర్ట్ :
ఆడవారిలో ఎముకలు బలంగా తయారు కావడానికి కాల్షియం చాలా అవసరం కాబట్టి రోజూ యోగర్ట్ తీసుకోవడం చాలా ముఖ్యం.
* పాలకూర :
పాలకూరలో విటమిన్లు A, C, Kతో పాటు ఫైబర్, ఫోలేట్ సమృద్ధిగా లభిస్తాయి
.
* గ్రేప్‌ఫ్రూట్, బెర్రీస్, చెర్రీస్ :
ఈ మూడు కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని పరిశోధనలలో తేలింది.
Also Read : రూ.100తో నెలకు రూ.57 వేలు ఆదాయం