హై కొలెస్ట్రాల్‌ లక్షణాలు

శరీరానికి అతి పెద్ద శత్రువు కొలెస్ట్రాల్

మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే అనేక సమస్యలు మొదలవుతాయి. 

సిరల్లో కొవ్వు పేరుకుపోయి రక్త సరఫరాకు ఆటంకం కలిగిస్తుంది.  

కొలెస్ట్రాల్ అనేది మన కాలేయంలో ఉత్పత్తి అయ్యే జిగట పదార్థం.

ఇది ఆరోగ్యకరమైన కణాలను తయారు చేయడంలో సహాయపడుతుంది.

ఎక్కువ నూనె, అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకుంటే, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఏర్పడటం ప్రారంభమవుతుంది.

శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఈ లక్షణాలు కనిపిస్తాయి 

ఛాతీ నొప్పి : శరీరంలో కొవ్వు ఎక్కువైతే ఛాతిలో నొప్పి వస్తూ ఉంటుంది. ఇది మీ శరీరంలో అధిక కొలెస్ట్రాల్ కు మొదటి సంకేతం. 

విపరీతమైన చెమట : సాధారణ పరిస్థితుల్లో లేదా చలికాలంలో కూడా విపరీతంగా చెమటలు పట్టడం ప్రారంభిస్తే.. అధిక కొలెస్ట్రాల్ అని గుర్తించండి.

బరువు పెరగటం : మీరు వేగంగా బరువు పెరుగుతుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగుతుందని గుర్తించండి. 

చర్మం రంగులో మార్పు : కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు మన శరీర చర్మంపై అనేక మార్పులు వస్తాయి. అటువంటి స్థితిలో, చర్మంపై పసుపు దద్దుర్లు కనిపిస్తాయి. 

(Disclaimer: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.)