నువ్వెప్పటికైనా కింగే
టి20 ప్రపంచకప్ 2024లో
టీమిండియా జగజ్జేతగా నిలిచింది.
ఫైనల్లో సౌతఫ్రికాపై 7 పరుగుల తేడాతో నెగ్గి రెండోసారి పొట్టి ప్రపంచకప్ ను ముద్దాడింది.
ఫైనల్ మ్యాచ్ ముందు వరకు కూడా కోహ్లీ ఫామ్ లో లేడు.
దాంతో అతడి పని అయిపోయిందంటూ చాలా మంది కామెంట్స్ చేశారు.
అయితే ఫైనల్లో విరాట్ కోహ్లీ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు.
59 బంతుల్లో 76 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
కోహ్లీ నుంచి ఆ పరుగులు వచ్చిండకపోయి ఉంటే టీమిండియా 176 పరుగులు చేసి ఉండేది కాదు.
ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
బౌలింగ్ లో హార్దిక్ పాండ్యా, అర్ష్ దీప్ సింగ్, బుమ్రాలు చెలరేగారు.
ఫలితంగా భారత్ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.
Other stories
రాత్రి పూట స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదా ? కాదా?
ఈ ఐదు కూరగాయలు తొక్కతో పాటు తినాలి