సైకిల్ కొంటున్నారా.. ఇవి గమనించండి

సైకిల్ కొంటున్నారా.. ఇవి గమనించండి

రోజు వారీ అవసరాలకైతే.. సన్నటి టైర్లు, బరువు తక్కువగా ఉండే సైకిల్ కొనుక్కోవాలి.

మీరు ఉండే ఏరియాలో రోడ్లు బాగుంటే, సన్న టైర్లు ఉండే సైకిల్ వల్ల సమస్యలు రావు

మీ ఏరియాలో రోడ్లు సరిగా ఉండకపోతే, టైర్లు మందంగా ఉండే సైకిల్ మేలు.

వెయిట్ లాస్ కోసమైతే.. పెద్ద టైర్లు, బరువైన సైకిల్ కొనాలి. దాన్ని తొక్కితే బరువు తగ్గుతారు.

పెద్ద చక్రాలు ఉండే సైకిల్ మేలు. అదైతే.. తక్కువ తొక్కినా.. ఎక్కువ దూరం వెళ్తుంది.

సైకిల్ సీటు ఎత్తును పెంచుకునే, తగ్గించుకునే వీలుండాలి.. ఇంట్లో వారంతా వాడుకోవచ్చు.

సైకిల్ కొనేటప్పుడు బ్రేక్స్ సరిగా పడుతున్నాయో లేదో షాపు దగ్గరే బాగా చెక్ చేసుకోండి.

సైకిల్‌కి లైట్ ఉంటే మంచిదే. తద్వారా రాత్రివేళ సైక్లింగ్ చెయ్యడానికి బాగుంటుంది.

గేర్ సైకిళ్లు రూ.10 వేల నుంచి లభిస్తున్నాయి. అవైతే శ్రమ లేకుండా వెళ్లేందుకు బాగుంటాయి.

సైకిల్‌కి లాక్, బుట్ట, గాలిపంపు, సీటు కుషన్ వంటి యాక్సెసరీస్ ఇస్తే మంచిదే, అవి ఉపయోగపడతాయి.

మీకు ఎలాంటి సైకిల్ కావాలో షాపు వాళ్లకు పూర్తి వివరాలు చెప్పడం ద్వారా సరైనది పొందగలరు.