భద్రాచలంలో వరిధాన్యానికి ప్రత్యేక పూజలు..
భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతుంది..
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో రామభక్తులు గోటి తలంబ్రాలు సమర్పిస్తున్నారు..
ఈ క్రమంలో సదరు గోటి తలంబ్రాలు కోసం విత్తే వారి ధాన్యాన్ని చేపట్టారు..
గత 12 సంవత్సరాలుగా భద్రాచల రాములవారికి గోటి తలంబ్రాలను సమర్పిస్తున్నారు..
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం రామపంట పండించారు..
కోరుకొండ మండలం అచ్చుతాపురంలోని ఎకరం పొలంలో వరి సాగు చేసి ధాన్యం తయారు చేశారు.
రామభక్తులు 4నెలల పాటు శ్రమించి, గోటితో వలిచి 800 కేజీల బియ్యంతో గోటితలంబ్రాలు సిద్ధం చేశారు..
12 ఏళ్ల నుంచి భద్రాచలం , 6ఏళ్లుగా ఒంటిమిట్ట రామాలయానికి కోటితలంబ్రాలు అందిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామస్థులు ఆలయానికి భారీగా తరలివచ్చారు..