రైతుబీమాకు దరఖాస్తుల ఆహ్వానం.. 

రైతు బీమా పేరుతో 2018 లో కేసీఆర్ ప్రభుత్వం ఒక వినూత్న పథకాన్ని రూపొందించింది.

దీని ద్వారా రైతులు ప్రమాదవశాత్తు మరణిస్తే.. బీమా మొత్తం రూ.5.00 లక్షలు చెల్లిస్తారు.

నామినీకి 10 రోజుల్లో ఈ పథకం లబ్ధి అందుతుంది.

ఈ పథకానికి 18 నుండి 59 సంవత్సరాల వయస్సు గల రైతులు  నమోదు  చేసుకోవచ్చు.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి మొత్తం ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తుంది.

తాజాగా రైతు బీమాకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

రైతు బీమాకు 2024 ఆగస్టు 5వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపింది.

ఇప్పటివరకు కూడా రైతు బీమా చేసుకోలేకపోయిన రైతులు మాత్రమే రైతు బీమా చేసుకోవాలని పేర్కొంది.

అర్హత కలిగిన రైతులు ఏఈవో కు దరఖాస్తులు సమర్పించాలని పేర్కొంది.