మైక్రో ఆర్టిస్ట్ ట్యాలెంట్ మాములుగా లేదుగా..

అంతరించిపోతున్న కళలకు జీవం పోస్తున్నాడు ఓ కళాకారుడు..

సూక్ష్మ కళలకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెస్తున్నాడు జగిత్యాల యువకుడు..

ఇతను...  డాక్టరేట్ గ్రహీత, గిన్నీస్ వరల్డ్ రికార్డు గ్రహీత గుర్రం దయాకర్..

గణపతి నవరాత్రుల సందర్భంగా గుండు పిన్నుపై ప్రత్యేక గణేషుడిని రూపొందించాడు.

చంద్రయాన్ 3జీ 20 మన దేశ జెండా పట్టుకుని నిలబడి ఉన్న గణపతిని తయారు చేశాడు

ఈ గణపతి యొక్క పొడవు 6 MMవెడల్పు 4 MM గా ఉంది..

అంతే కాకుండా దీనితయారీకి దాదాపు 8గంటల సమయం పట్టిందన్నాడు.

ఆవగింజ పరిమాణంలో గణపతి, గాంధీజీ, బుద్ధుడు, బంగారు తల్లి నమునాలు చేశాడు..

గుండు పిన్ను మోనపై యోగా చేస్తున్న మహిళ బియ్యపు గింజలతో రైతన్న ను చేశాడు

ఎన్నో సూక్ష్మ కళ అద్భుతాలను సృష్టించి గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా సాధించాడు.

 పలు సూక్ష్మ కళ్ళకు ఎన్నో జాతీయ అవార్డులు రావడం కూడా విశేషం.