Constable Jobs: కానిస్టేబుల్ ఉద్యోగాలు.. 

ఇంటర్‌ అర్హతతో పోలీస్‌ ఉద్యోగంలో చేరాలనుకొనే వారికి అలర్ట్‌. 

ఢిల్లీ పోలీసు విభాగంలో భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.

మొత్తం 7,547 కానిస్టేబుల్‌ (ఎగ్జిక్యూటివ్‌) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 

సెప్టెంబర్‌ 1 నుంచి మొదలైన ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ త్వరలోనే ముగియనుంది. 

ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 30వరకు ఆన్‌లైన్‌లో https://ssc.nic.in/ దరఖాస్తులు చేసుకోవచ్చు. 

డిసెంబర్‌లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.

 పురుషుల విభాగంలో 5,056, మహిళలు విభాగంలో 2,491 చొప్పున ఉద్యోగాలు భర్తీ చేస్తారు.

10+2 ఉత్తీర్ణతతో పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ (LMV) ఉన్న వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపికైన వారికి రూ. 21,700 నుంచి రూ.69,100 మధ్య చెల్లిస్తారు. 

కంప్యూటర్ ఆధారిత పరీక్ష, దేహదారుఢ్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక ఉంటుంది.  

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష డిసెంబర్‌లో నిర్వహించే అవకాశం ఉంది.