యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబర్‌లను పెంచే ఫార్ములా.. భారీ సంపాదన

ఈ రోజుల్లో యూట్యూబ్ ద్వారా చాలా మంది సంపాదిస్తున్నారు.

మనీ సంపాదించేందుకు ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లు అవసరం.

సబ్‌స్క్రైబర్‌లను పెంచుకోవడానికి, తరచూ వీడియోలను అప్‌లోడ్ చెయ్యాలి

మీరు వారానికి ఒక వీడియోని పోస్ట్ చేస్తూ ఉంటే, ఆ సంఖ్యని 3కి పెంచండి.

వీడియోలో ఎప్పుడూ కొత్తదనాన్ని చూపించడానికి ప్రయత్నించండి.

వీడియో క్వాలిటీని కూడా అద్భుతంగా ఉంచండి. కనీసం HD క్వాలిటీ ఉండాలి.

పెద్ద వీడియోలతోపాటూ, షార్ట్స్ కంటెంట్‌ను కూడా పోస్ట్ చేస్తూ ఉండండి.

ఆకర్షణీయమైన థంబ్‌నెయిల్ వీడియో రీచ్‌ను పెంచగలదు.

వీడియో హెడ్డింగ్‌ ఆసక్తిగా ఉండాలి. అలాగని నెటిజన్లను మోసం చేసేలా ఉండకూడదు.

వీడియోలలో ముఖ్యమైన కంటెంట్ ఉండాలి. టైమ్ వేస్ట్ చేసే విషయాలు ఉండకూడదు.

మీ సబ్‌స్క్రైబర్లు చేసే కామెంట్లకు, వేసే ప్రశ్నలకూ మీరు స్పందించాలి. జవాబులు ఇవ్వాలి.