PM Kisan: రైతులకు భారీ హెచ్చరిక.. 

రేపు రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు జమ కానున్నాయి.

17వ విడత డబ్బుల కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు.

రేపు వారణాసిలో పర్యటించనున్న మోదీ పీఎం కిసాన్ కు సంబంధించి  17వ విడత నిధులను విడుదల చేయనున్నారు.

రూ.20వేల కోట్లకు పైగా నిధులను మోదీ 9.26 కోట్ల మంది లబ్దిదారులైన రైతుల బ్యాంక్ అకౌంట్లలో డైరెక్టుగా జమ చెయ్యబోతున్నారు.

ఇదిలా ఉండగా.. వాట్సాప్ గ్రూపులతో చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే ప్రతీ లింక్ ను క్లిక్ చేయవద్దని వారిస్తున్నారు.

చేతిలో మొబైల్‌ ఉంది కదా అని గ్రూపులో వచ్చిన లింక్‌లను క్లిక్‌ చేసుకుంటూ పోతే అది హ్యాక్‌ అయిపోవడం ఖాయం.

అంతేకాదు మన ఫోన్‌ నెంబరుతో ఇతరులకు సందేశాలు పంపించే ప్రమాదం ఉంది.

 ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలోని సిరికొండ మండలం సోంపెల్లి గ్రామంలో ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది.

సోంపెల్లి గ్రామంలో దాదాపుగా 10 మందికి పైగా వాట్సాప్‌ ఖాతాలు హ్యాక్‌ అయి లబోదిబోమంటున్నారు.

ప్రతీ ఒక్కరూ మొబైల్‌లో వచ్చే యాప్‌లపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

పీఎం కిసాన్‌ యాప్‌లను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్‌ చేయొద్దన్నారు.

మరో 18 గంటల్లో పీఎం కిసాన్ డబ్బులు రైతుల అకౌంట్లోకి రానున్నాయి.