ప్రకృతి మనకు అద్బుతమైన పండ్లను అందిస్తుంది. ఇవి తినడానికి రుచిగా ఉండటమే కాదు ఇందులో ఉండే న్యూట్రియేంట్స్ మన స్కిన్ కు అందాన్ని ఇస్తుంది.
ఈ పండ్లతొక్కల్లో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు, నేచురల్ ఎక్స్ ఫోలియేంట్స్ మన ముఖానికి రెట్టింపు అందాన్ని ఇస్తుంది.
ఓ 10 రకాల పండ్లతొక్కలు మీ స్కిన్ కేర్ రొటీన్ లో చేర్చుకోండి. అవి మనకు గ్లోయింగ్ స్కిన్ అందిస్తాయి.
ఆరేంజ్ పీల్..
ఆరేంజ్ లో విటమిన్ సీ పుష్కలంగా ఉంటాయి. ఇది యాక్నేను తగ్గించి, నల్లమచ్చలకు చెక్ పెడుతుంది. అంతేకాదు కొల్లజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. దీనికి ఆరేంజ్ తొక్కలను గ్రైండ్ చేసి, పెరుగుతో కలిపి ఫేస్ మాస్క్ వేసుకోండి.
లెమన్ పీల్..
నిమ్మతొక్కల్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మంపై ఉన్న అధికనూనెను తగ్గించి, చర్మాన్ని మెరిపిస్తుంది. దీనికి నిమ్మతొక్కతో పౌడర్ చేయాలి. తేనెతో మిక్స్ చేసి మాస్క్ లా వేసుకుంటే యాక్నేను తగ్గిస్తుంది.
అరటితొక్క..
అరటిపండు తొక్కలో విటమిన్ ఏ, బీ, సీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అరటితొక్కను మీ ముఖంపై రుద్దండి. ఇది నేచురల్ మాయిశ్చరైజర్. చర్మంవాపును తగ్గించి చర్మంపై గీతలను మటుమాయం చేస్తుంది.
బొప్పాయి..
బొప్పాయి తొక్కలో పాపెయిన్ ఎంజైమ్ ఉంటుంది. ఇది చర్మాన్ని ఎక్స్ ఫొలియేట్ చేసి గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది. బొప్పాయి తొక్కను గ్రైండ్ చేసి పేస్ట్ లా చేయాలి. దీన్ని స్కిన్ కు అప్లై చేస్తే మీ చర్మానికి పునరుజ్జీవనాన్నిస్తుంది.
గ్రేప్ ఫ్రూట్..
గ్రేప్ ఫ్రూట్ లో పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ప్రీరాడికల్స్ తో పొరాడి కొల్లెజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. గ్రేప్ ఫ్రూట్ తొక్కలను పేస్ట్ చేసి కొబ్బరినూనెలో కలిపి స్క్రబ్ మాదిరి ఉపయోగించవచ్చు.
కీవీ పీల్..
కీవీలో విటమిన్ ఇ, ఏ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి. దీంతో వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉంటాయి. కీవీ తొక్కలను పేస్ట్ చేసి పెరుగుతో కలిపి మాస్క్ లా వేసుకోవాలి.
పైనాపిల్ తొక్క..
పైనాపిల్ లో బ్రొమెలిన్, ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి డెడ్ స్కిన్ సెల్స్ ను ఎక్స్ ఫోలియేట్ చేసి వాపును తగ్గిస్తుంది. పైనాపిల్ తొక్కతో తయారుచేసిన పొడిని తీసుకుని, తేనెతో కలిపి అప్లై చేయండి. స్కిన్కు గ్లోయింగ్ పెరుగుతుంది.
యాపిల్ తొక్క..
యాపిల్లో విటమిన్ ఏ ఉంటుంది. ఇది చర్మకణాలకు పునరుత్పత్తికి తోడ్పడతాయి. యాపిల్ తొక్కలను మరిగించి ఆ నీటిని టోనర్ లా వాడచ్చు.
మామిడి తొక్కలు..
మామిడిలో విటమిన్ ఏ, సీ, ఇ ఉంటాయి. ఇవి చర్మానికి నేచురల్ గ్లో ఇస్తుంది. మామిడితొక్కను పల్ప్ లా చేసి మాస్క్ లా వేసుకోవాలి.
అవకాడో..
అవొకాడో తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని పొడిలా చేసి కలబంద జెల్ కలిపి మాయిశ్చరైజర్ లా వాడండి.