ఈ ఔషధ ఆకుల్ని రోజూ ఇలా తింటే కంట్రోల్‌లో డయాబెటిస్

ఈ ఔషధ ఆకులను రోజూ ఖాళీ కడుపుతో నమలితే, రక్తంలో చక్కెర కంట్రోల్‌లో ఉంటుంది.

డయాబెటిస్ బాధితుల రక్తంలో తరచూ చక్కెర నియంత్రణలో ఉండదు.

చక్కెరను నియంత్రించేందుకు అనేక ఔషధాల్ని వాడాల్సి ఉంటుంది.

బ్లడ్ షుగర్‌ని కూడా కొన్ని హోం రెమెడీస్‌తో కంట్రోల్ చేయవచ్చు.

NCBI ప్రకారం, కలబంద ఆకులు మధుమేహాన్ని నియంత్రించగలవు.

కలబంద ఆకుల రసాన్ని ఖాళీ కడుపుతో తింటే ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది.

వేప ఆకులను తినడం వల్ల కూడా బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది.

వేప ఆకులు ప్యాంక్రియాస్‌ను ఉత్తేజపరిచి చక్కెరను నియంత్రిస్తాయి.

ఈ ఆకుల్లో ఉండే సమ్మేళనాలు మధుమేహాన్ని నియంత్రిస్తాయి.

సీతాఫలం ఆకులు కూడా రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి.

మీ డాక్టర్ సలహాలతో ఈ ఔషధ ఆకుల వినియోగంపై నిర్ణయం తీసుకోండి.