పండ్లు కాసే 10 ఇండోర్ ప్లాంట్స్..

నిమ్మ.. నిమ్మమొక్కను ఇండోర్ ప్లాంట్ కూడా. దీనికి మంచి సువాసనతోపాటు పూలు, పండ్లను కాస్తాయి. 

ఏం చక్కా ఈ మొక్కను మీరు ఇంట్లోనే పెంచుకోవచ్చు. కానీ, దీన్ని దక్షణముఖంగా కాస్త సన్ లైట్ పడేలా ఏర్పాటు చేసుకోవాలి.

లైమ్.. ఇది కూడా ఒకరకం సిట్రస్ ప్లాంట్. లైమ్ ఇండోర్ ప్లాంట్. దీనికి కాసే పండ్లను కూడా వంటలు, బేకింగ్ , కాక్ టెయిల్స్ లో వాడతారు. 

వీటికి ఉండే ఆకులు మంచి అరోమాను ఇస్తాయి. అందుకే వీటిని టీ ఇన్ఫూషన్ గా వాడతారు.

ఆరెంజ్.. బొన్సాయి ఆరెంజ్ మొక్క కూడా ఇండోర్ ప్లాంట్. కానీ, పండ్లు కాయాలంటే దీనికి 60 నుంచి 90 డిగ్రీల టెంపరేచర్ సన్ లైట్ అవసరం.

క్లెమంటైన్.. ఇది మాండరిన్ ఆరెంజ్ రకం. ఈ పండు తీయగా ఉంటుంది. దీనికి గింజ కూడా ఉండుదు.సులభంగా తినేయచ్చు. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల మీ ఇల్లు మరింత డెకరేటివ్ గా అందంగా కనిపిస్తుంది.

కుమ్ క్వత్.. ఇవి చైనా మొక్కలు. ఇందులో మెడిసినల్ లక్షణాలు ఉంటాయి. అందుకే సంప్రదాయ చైనిస్ మెడిసిన్లలో రోగాలు నయం చేయడానికి ఈ మొక్కను ఉపయోగిస్తారు.

ఫిగ్.. దీనికి కూడా కాసింత సన్ లైట్ ఉంటే సరిపోతుంది. కానీ, దీనికి నాటే కుండి కాస్త పెద్ద సైజులో ఉంచాలి.  ఈ ఫిగ్ మొక్క కూడా ఇండోర్ ప్లాంట్.

అలీవ్.. దీనికి ఎక్కువ నిర్వహణ కూడా అవసరం ఉండదు. దీనికి కూడా ఇండోర్ ప్లాంట్ కు సరిపోయే ఎండ సరిపోతుంది.  డ్రైన్ సిస్టం బాగుండాలి. తరచూ ప్రూనింగ్ చేస్తే అలీవ్స్ బాగా కాస్తాయి. 

అరటిచెట్టు.. అరటిచెట్టులో కూడా ఉండే బోన్సాయ్ రకం ఇండోర్ ప్లాంట్ గా పెంచుకుంటారు. వీటికి బనానాలు కాస్తాయి.

అప్రికట్.. అప్రికట్స్ జ్యూసీ ఫ్రూట్. వీటిని కుకింగ్, బేకింగ్ లేదా నేరుగా చెట్టు నుంచి కోసి తినవచ్చు. ఇవి కూడా ఇండోర్ ప్లాంట్స్ గా పెంచుకుంటారు.

అవకాడో.. అవకాడో కూడా ఇండోర్ ప్లాంట్ గా పెంచుకోవచ్చు.