ఫ్యాటీ లివర్ ఉంటే ఈ 7 లక్షణాలు కనిపిస్తాయి..

కాలేయానికి ఎక్కువ శాతం కొవ్వు పేరుకుని ఉంటే ఫ్యాటీ లివర్ సమస్య అంటారు.

ఇది మొదటిదశలో వచ్చే చిన్నపాటి ఆరోగ్య సమస్యలను గుర్తిస్తే సులభంగా తగ్గించుకోవచ్చు

కానీ, పరిస్థితి చేయి దాటిపోతే కాలేయవాపు, కాలేయం పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ ఆరోగ్యకరమైన కాలేయం పూర్తిగా చెడిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు.

ఈ అడ్వాన్డ్స్ స్టేజ్ నే లివర్ సిర్రోసిస్ అంటారు. ఇది లివర్ ఫెయిల్యూర్ కూడా దారితీస్తుంది. అది కాలేయ కేన్సర్ ను కూడా అభివృద్ధి చేస్తుంది.

కొన్ని హెచ్చరికల ద్వారా మనం ముందుగానే ఫ్యాటీ లివర్ సమస్యను గుర్తించవచ్చు.

దీనిమొదటి లక్షణం పొత్తికడుపులో కనిపిస్తుంది. దీన్ని ఎసిటైస్ అంటారు. ఫ్లూయిడ్స్ కడుపులో పేరుకుంటాయి.

ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే కాళ్లు, చేతుల్లో వాపు కూడా కనిపిస్తుంది. ఈ స్థితిని ఎడిమా అంటారు.

మగవారిలో ఫ్యాటీ లివర్ సమస్య ప్రమాదస్థితికి చేరుకుంటే గైనకోమాస్టియా రావచ్చు. దీనివల్ల ఛాతిలోని కణజాలం వ్యాకోచం చెంది హర్మోనల్ అసమతుల్యతకు దారితీస్తుంది. ఇది లైంగిక అనాసక్తి, పిల్లలు లేమికి దారితీస్తుంది

ఫ్యాటీ లివర్ మరో లక్షణం చేతుల్లో కనిపిస్తుంది. చేతుల్లో కూడా వాపు కనిపిస్తుంది.

ఫ్యాటీ లివర్ వల్ల వ్యాపించే ఎడిమా కొన్ని పరిస్థితుల్లో పాదాలకు కూడా వ్యాపిస్తుంది. దీంతో పాదాలు కూడా వాపు వస్తుంది.