నిద్రలేమి సమస్య వేధిస్తోందా?
ప్రతిరోజూ కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం.
దీని వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం మన సొంతం అవుతుంది.
కొందరికి రాత్రి వేళ ఎంత ప్రయత్నించినా నిద్రపట్టదు. ఒకవేళ పట్టినా మధ్యలోనే మేల్కొంటారు.
ఇది మన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. అందుకే మంచి నిద్ర కోసం ఈ చిట్కాలు పాటిద్దాం.
పసుపు కలిపిన పాలను తాగితే చక్కని ఆరోగ్యంతో పాటు నుంచి నిద్రకూడా పడుతుంది.
అందుకే నిద్రపోవడానికి ముందు ఒక గ్లాసు పసుపు పాలు తాగి చూడండి.
బాదంపాలులో మంచి నిద్రకు తోడ్పడే పోషకాలు ఉంటాయి. నిద్రలేమితో బాధపడుతుంటే బాదం పాలు తాగవచ్చు.
చెర్రీస్లో మెలటోనిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మంచి నిద్రకు సహాయపడుతుంది. నిద్రకు ఒక గంట ముందు చెర్రీ రసం తాగితే మంచిది.
రాత్రి భోజనాన్ని మితంగా తీసుకోవాలి. నిద్రవేళకు కనీసం రెండు గంటల ముందే ముగించడం మంచిది.
చాలా మంది తిన్న వెంటనే నిద్రపోతుంటారు. అది మంచిది కాదని వైద్యులు అంటున్నారు.
రాత్రివేళ వేయించిన, మసాలాతో కూడిన ఆహారపదార్థాలు, ఐస్క్రీమ్స్, టీ, కాఫీలను తీసుకోకపోవడం ఉత్తమం.
More
Stories
రూ.50వేల పెట్టుబడితో వ్యాపార ఐడియా
యాపిల్స్ ఎక్కువగా తింటే.. ప్రమాదమే!
పుచ్చకాయ రహస్యాలు