ఈ ఫుడ్స్ ఆన్ లైన్‌లో ఆర్డర్ పెట్టొద్దు..!

ఈరోజుల్లో చాలామంది తమకు ఏం కావాలన్న ఆన్ లైన్‌లో ఆర్డర్ పెట్టేస్తున్నారు.

అయితే అన్ని రకాల ఫుడ్స్ ఆన్ లైన్‌లో తెప్పించకూడదు.

కొన్ని రకాల ఫుడ్స్ ఆన్ లైన్‌లో తెప్పించడం మంచిది కాదు.

ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయకూడని కొన్ని ఆహారాలు ఏంటో తెలుసుకుందాం..

ఫ్రెంచ్ ఫ్రైలను ఎవరు ఇష్టపడరు. అయితే ఆన్‌లైన్‌లో వీటిని ఆర్డర్ చేయకపోవడమే మంచిది.

ఎందుకంటే ఇవి చేసిన కాసేపటి వరకు మాత్రమే ఫ్రెష్‌గా ఉంటాయి. 

చిప్స్ మరియు నాచోలకు కూడా అదే జరుగుతుంది.

ఐస్ క్రీం ఎంత త్వరగా తెచ్చినా అది కాస్త కరిగిపోతుంది.

శీతాకాలంతోపాటు వేసవిలోనూ ఇదే సమస్య రావచ్చు.

స్మూతీస్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే స్మూతీ కాసేపటికే వేెడెక్కుతుంది.

మీరు గ్రేవీ నూడుల్స్ ఆర్డర్ చేస్తే అవి వేరే వేరే కంటైన్లో వస్తే మంచిది.

ఇక బేక్ చేసిన శాండ్ విచ్‌లను కూడా ఆన్ లైన్ లో ఆర్డర్ చేయొద్దు.