వీటిని తింటే హాయిగా నిద్రపోవచ్చు!

బిజీ లైఫ్ వల్ల చాలా మందికి మంచి నిద్ర కరవైంది. 

పడుకున్న వెంటనే నిద్ర రావడం లేదు. 

ప్రతిరోజూ 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. 

నిద్ర లేమి వల్ల ఆరోగ్యం చాలా రకాలుగా ప్రభావితమవుతుంది. 

ఈ సమస్యను పరిష్కరించడానికి అనేక మార్గాలు ఉన్నాయి.

వీటిని తినడం వల్ల మంచి హాయిగా నిద్రపోవచ్చని రిపోర్ట్స్ చెబుతున్నాయి.

అరటిపండ్లు నిద్రను ప్రేరేపించే లక్షణాలు కలిగి ఉంటాయి.

ఈ పండ్లు మెగ్నీషియం, పొటాషియంతో నిండి ఉంటాయి. 

ఈ రెండూ కండరాలు విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడతాయి.

బాదం, చేపలు, తృణధాన్యాలు, చీజ్‌తో చేసిన ఓట్‌కేక్‌ల తిన్నా హాయిగా నిద్రపోవచ్చు. 

ద్రాక్ష, టార్ట్ చెర్రీస్, స్ట్రాబెర్రీ పండ్లను ఆహారంలో చేర్చుకోవడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది.