కాకరకాయలతో కలిపి వీటిని తినకూడదు..

కాకర కాయలు రుచికి చేదుగా ఉన్నా, ఇవి ఆరోగ్యానికి మంచివి. 

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే సామర్థ్యం ఈ కూరగాయకు ఉంది.

అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కాకరకాయను కొన్ని ఆహార పదార్థాలతో కలిపి వండకూడదు, తినకూడదు. 

ఈ ఫుడ్ కాంబినేషన్స్ టేస్ట్, ఫ్లేవర్స్ సరిగా ఉండవు. అవేంటంటే..

సుగంధ ద్రవ్యాలు లవంగాలు, దాల్చినచెక్క, జాజికాయ వంటి ఘాటైన సుగంధ ద్రవ్యాలను కాకర వంటకాల్లో వాడకూడదు. 

తీపి పండ్లు అరటి, యాపిల్, మామిడి వంటి పండ్లు కాకరతో కలిపి తినకూడదు. ఈ కాంబినేషన్ సెట్ కాదు, రుచి దెబ్బతింటుంది.

మటన్ మటన్ వంటి మాంసాలతో కాకరకాయను కలిసి వంటకాలు చేయకూడదు, ఈ రెండింటినీ కలిపి తినకూడదు. 

ఎసిడిక్ ఫుడ్స్ టమాటా, నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లు.. కాకరకాయలతో కలిపి కూరలు తయారు చేయకూడదు.

ప్రాసెస్డ్ ఫుడ్స్ చిప్స్, మిక్చర్, షుగర్ స్నాక్స్ వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలు.. కాకరలోని సహజ చేదుతో రియాక్ట్ అవుతాయి. 

పాల ఉత్పత్తులు కాకరతో పాల ఉత్పత్తులను కలిపి తినకూడదు. 

గమనిక.. ఇది సోషల్ సమాచారం మాత్రమే. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి.