వీరు నేరేడు పండ్లు తినకూడదు.. చాలా డేంజర్!

నేరేడు పండ్లను ఇండియన్ బ్లాక్ బెర్రీ లేదా జామూన్ అంటారు. 

వేసవి కాలం ముగుస్తున్న సమయంలో… ఈ పండ్లు మార్కెట్‌లో లభిస్తాయి. 

ఈ సీజన్‌లో మార్కెట్లో నేరేడు పళ్లు ఎక్కువగా కనిపిస్తాయి. 

ఇవి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నేరేడు పండ్లకు దూరంగా ఉండాలి.

రక్తంలో చక్కెర లోపం.. నేరేడు పండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను బాగా తగ్గిస్తాయి. 

మీరు డయాబెటిస్‌తో బాధపడుతుంటే.. నేరేడు పండ్లు ఎక్కువగా తినకూడదు. 

నేరేడు పండ్లు ఎక్కువగా తింటే మీ రక్తంలో షుగర్ లెవల్స్ పడిపోయే ప్రమాదముంది. 

మలబద్ధకం.. నేరేడు పండ్లు ఎక్కువ పరిమాణంలో తింటే మలబద్ధకం ఏర్పడుతుంది. 

చర్మ సమస్యలతో బాధపడేవారు.. మీ ముఖం మీద మొటిమలు లేదా స్కిన్ ట్యూమర్స్ వంటి సమస్యలు ఉంటే నేరేడు పండ్లకి దూరంగా ఉండాలి.

వాంతులు, వికారంతో బాధపడేవారు.. నేరేడుపండ్లు ఎక్కువగా తినే కొందరిలో వాంతులు రావచ్చు. 

గమనిక.. ఇది సోషల్ సమాచారం మాత్రమే. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి.