వీళ్లు పిస్తా పప్పు తినకూడదు!

సంపూర్ణ ఆరోగ్యం కోసం అన్ని రకాల పోషకాలు లభించే ఆహారాలు తినాలి. 

వివిధ రకాల డ్రై ఫ్రూట్స్‌లో ఇలాంటి మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి

వీటిలో పిస్తా పప్పులు (Pistachios) ఒకటి. 

పిస్తా పప్పులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 

ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొందరు పిస్తా పప్పు తినకూడదని వైద్యులు చెబుతున్నారు. 

బరువు తగ్గాలనుకునేవారు.. బరువు తగ్గాలనుకునే వారు పిస్తా పప్పులు తినకూడదు. ఎందుకంటే వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. 

జీర్ణ సమస్యలు.. అయితే జీర్ణ సమస్యలతో బాధపడేవారు పిస్తా పప్పులు తినకూడదు. ఇవి శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తాయి. 

అలర్జీ రోగులు.. ఇలాంటి వారు పిస్తా పప్పు కూడా తినకూడదు. ఇవి శరీరానికి వేడిని కలిగిస్తూ దురద వంటి చర్మ సమస్యలకు కారణం అవుతాయి. 

కిడ్నీ పేషెంట్లు.. కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా పిస్తా పప్పులు తినకూడదు. 

చిన్న పిల్లలు.. కొందరు చిన్నారులు ఈ పప్పులను సరిగా నమలరు. దీంతో మింగేటప్పుడు పిస్తా గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. 

వ్యాధులకు మందులు వాడేవారు.. ఏదైనా వ్యాధికి రెగ్యులర్‌గా మందులు వాడే రోగులు పిస్తా పప్పు తినకపోవడం మంచిది.

గమనిక.. ఇది సోషల్ సమాచారం మాత్రమే. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి.