వీళ్లు కాఫీ తాగకూడదు.. చాలా డేంజర్..

ఉదయాన్నే నిద్ర లేవగానే చాలామంది టీ లేదా కాఫీ తాగుతారు.

కొందరు టీ కంటే కాఫీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. 

కానీ కొందరు వ్యక్తులు అస్సలు కాఫీ తాగొద్దని నిపుణులు చెబుతున్నారు. 

కొన్ని రకాల అనారోగ్యాలు ఉన్నవారు కాఫీ తాగితే ఇతర సమస్యల ప్రమాదం పెరగవచ్చు. 

ఎవరెవరు కాఫీ తాగకూడదో తెలుసుకుందాం.

గుండె సంబంధ సమస్యలతో బాధపడే వారు కాఫీ తాగకపోవడమే మంచిది. 

నిద్రలేమితో బాధపడేవారు కాఫీకి దూరంగా ఉండాలి. 

గ్లాకోమా వంటి కంటి సమస్య ఉన్న వ్యక్తులు, పేగు సంబంధ సమస్యలు ఉన్నవారు కాఫీ తాగకూడదు.

గుండెల్లో మంటతో బాధపడుతున్న వ్యక్తులు కాఫీకు దూరంగా ఉండాలి. 

గర్భధారణ సమయంలో మహిళలు కాఫీ వినియోగం తగ్గించాలి.

యాంటీ డిప్రెసెంట్స్, ఆస్తమా మందులు తీసుకునే వ్యక్తులు కూడా కాఫీకి దూరంగా ఉండాలి.

గమనిక.. ఇది సోషల్ సమాచారం మాత్రమే. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి.