భలే భలే చేప.. ఇది నడుస్తుంది..

సాధారణంగా చేపలు నీటిలో ఉన్నంతకాలం బతుకుతాయి. 

కొన్ని ప్రాంతాల్లో నివసించే చేపలు మాత్రం కొంచెం స్పెషల్. 

అవి నీటిలోనే కాకుండా భూమి మీద కూడా నివసించగలుగుతున్నాయి.

ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని సముద్ర తీరాల్లో నివసించే ఓ చేప మాత్రం వెరైటీ..

ఈ చేప మాత్రం కష్టమైన పరిస్థితుల్లో బతికేందుకు అలవాటు పడింది. 

అంతేకాకుండా, ఇది భూమి మీద కూడా నడవగలదు. 

ఆ వాకింగ్, జంపింగ్ ఫిష్ పేరు మడ్‌స్కిప్పర్ (Mudskipper). 

వీటిని మత్స్యకారులు "మోప్పడాయ చేపలు" అని ముద్దుగా పిలుస్తుంటారు.

ఈ చేప బురదమట్టి మీద నడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లగలదు.