ప్రస్తుతం యువత వ్యవసాయం, వ్యవసాయ వ్యాపారం కంటే ఉపాధి వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.
కానీ ఈరోజుల్లో ఉద్యోగం సంపాదించడం కష్టంగా మారింది.
అయితే కొంత మంది మాత్రం ఆదునిక పద్ధతిలో వ్యవసాయం చేస్తూ లాభాలు పొందుతున్నారు.
సతారా జిల్లాకు చెందిన జవాన్ రాజేంద్ర లక్ష్మణ్ గైక్వాడ్ 17 ఏళ్ల పాటు భారత సైన్యంలో పనిచేశారు.
ప్రస్తుతం ఈ మాజీ సైనికుడు లక్షల్లో సంపాదిస్తున్నాడు.
రాజేంద్ర గైక్వాడ్ ఇండియన్ ఆర్మీలో ఉండేవాడు. 17 ఏళ్ల సర్వీసు తర్వాత పదవీ విరమణ చేశారు.
పదవీ విరమణ తర్వాత వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనితో పాటు మేకలు పెంచాలనుకున్నాడు.
మేకల పెంపకం వ్యాపారం ప్రారంభించే సమయంలో అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కానీ పట్టు వదలలేదు.
ప్రస్తుతం ఈ సైనికుడి దగ్గర 36 మేకలు ఉన్నాయి.