నిమిషానికి 4.5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో..!

బాలీవుడ్‌లో ఓ వైపు స్టార్ హీరోగా కొనసాగుతూనే.. మరోవైపు టాలీవుడ్ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన హీరో అజయ్ దేవగణ్

హీరోగా సూపర్ ఫాంలో ఉన్నప్పుడే.. ‘ఆర్ఆర్ఆర్‌’లో రామ్ చరణ్ తండ్రిగా గెస్ట్ రోల్ చేశాడు.

అల్లూరీ వెంకటరామరాజుగా బ్రిటీష్ వాళ్లను మట్టికరిపించాలని చూసే రోల్ లో నటించాడు. 

సినిమా మొత్తంలో అజయ్ దేవగణ్ దాదాపు 8 నిమిషాల పాటు కనిపించాడు. 

కాగా 8 నిమిషాల కోసం అజయ్ దేవగణ్ భారీగానే పారితోషికం తీసుకున్నాడని తెలుస్తుంది.

ఈ సినిమా కోసం నిమిషానికి రూ.4.5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడని సమాచారం. 

అంటే మొత్తంగా రూ.36 కోట్ల వరకు పారితోషికం అందుకున్నాడు.

ఇలా పట్టుమని పది నిమిషాలు కూడా కనిపించని రోల్‌ కోసం అంత తీసుకోవడం అంటే మాములు విషయం కాదు.

ఇక రెండేళ్ల కిందట వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా సంచలనం అనే మాటను కూడా దాటింది.

గ్లోబల్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకుని.. తెలుగు సినిమా గురించి అందరు మాట్లాడుకునేలా చేసింది.

ప్రస్తుతం రాజమౌళి ఎస్ఎస్ఎమ్‌బీ29 సినిమా కోసం కసరత్తులు చేస్తున్నాడు.