మహిళలకు బెస్ట్ దేశాలు ఇవే.! భారత్ స్థానం ఎక్కడ?

అమెరికా న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్డ్ ఈ జాబితాను తయారుచేసింది.

ప్రపంచ దేశాల్లో 9వేల మందిని సర్వే చేసి, ఈ లిస్ట్ ఇచ్చింది.

స్త్రీ పురుష సమానత్వం, సంపద, రక్షణ, మానవ హక్కులను లెక్కలోకి తీసుకుంది.

ఈ జాబితాలో ఉత్తర యూరప్ దేశం స్వీడన్ టాప్‌లో నిలిచింది. 

తర్వాత నార్వే, డెన్మార్క్, నెదర్లాండ్స్, ఫిన్‌లాండ్ ఉన్నాయి. ఇవన్నీ యూరప్ దేశాలే!

6వ స్థానంలో కెనడా, 7లో స్విట్జర్లాండ్, 8లో న్యూజిలాండ్ ఉన్నాయి.

9లో ఆస్ట్రేలియా, 10వ స్థానంలో జర్మనీ నిలిచాయి.

టాప్ 10లో 7 దేశాలు యూరప్‌వే ఉన్నాయి. 

ఈ లిస్టులో భారత్ 74వ స్థానంలో ఉంది. అంటే చాలా వెనక్కి ఉన్నట్లే.

భారత్‌లో స్త్రీలను దేవతల్లా చూస్తారని చెప్పుకుంటాం. కానీ అదొక్కటే చాలదు.

భారత్‌లో మహిళల అభ్యున్నతికి ఎంతో చెయ్యాల్సి ఉందని ఈ జాబితా చెబుతోంది.