ఆశ్చర్యపరిచే 10 మార్స్ నిజాలు
సూర్యుడి నుంచి మార్స్ 4వ గ్రహంగా ఉంది. లక్ ఏంటంటే ఈ గ్రహం, మనం నడిచేందుకు వీలుగా ఉంటుంది.
మార్స్‌ని రెడ్ ప్లానెట్ అంటారు. ఇది పూర్తిగా ఎర్రమట్టితో ఉంటుంది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.
మార్స్‌పై పగటివేళ 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. రాత్రిళ్లు మైనస్ 153 డిగ్రీల దాకా ఉంటుంది.
మార్స్‌పై ఉంటే మనకు 2 చందమామలు కనిపిస్తాయి. అవి ఫోబోస్, డీమోస్.
మార్స్‌పై ఇసుక తుపాన్లు వస్తుంటాయి. ఒక్కోసారి నెలలపాటూ కొనసాగుతాయి. గ్రహం మొత్తం రాగలవు.
మార్స్‌పై ఒక రోజు 24.6 గంటలు ఉంటుంది. కానీ ఒక సంవత్సరానికి 687 రోజులు ఉంటాయి.
మార్స్‌పై మనం తక్కువ బరువు ఉంటాం. అందువల్ల ఎక్కువ దూరం గెంతగలం.
భూమితో పోల్చితే మార్స్ వాతావరణం 100 రెట్లు పలుచగా ఉంటుంది. ఆక్సిజన్ తక్కువ. ఊపిరి తీసుకోలేం.
మార్స్‌పై ఉండాలంటే, అక్కడి నేలపై తిరగాలంటే ఆక్సిజన్‌తో కూడిన స్పేస్ సూట్ అవసరం.
మార్స్‌పైకి నాసా ఇప్పటివరకూ 5 రోవర్లు పంపింది. చివరిగా పెర్సెవెరాన్స్‌ని పంపింది.
మార్స్‌పై ఒకప్పుడు జీవం ఉండేదని నాసా నమ్ముతోంది. అందువల్ల అక్కడ కాలనీ కట్టాలి అనుకుంటోంది.
More
Stories
నిద్రలేచాక ఈ దేవుడికి నమస్కరించి, ఈ మంత్రం చదివితే, అదృష్టఫలమే
గ్రీన్ ఫుడ్ తినండి. కలకాలం ఆరోగ్యంగా ఉండండి
వేడి తగ్గించే ఆహారం