భారీగా తగ్గనున్న రీఛార్జ్ ధరలు..
మొబైల్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పనుంది.
టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు అందించే మొబైల్ రీఛార్జి ప్లాన్లను సమీక్షించేందుకు టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జీ వోచర్లను తీసుకురావాలని ట్రాయ్ భావిస్తోంది.
వచ్చే నెల 16లోగా తమ అభిప్రాయాలు తెలియజేయాలని వినియోగదారులను కోరింది.
‘కన్సల్టేషన్ ఆన్ రివ్యూ ఆఫ్ టెలికాం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ (TCPR) -2012’ ఓ సంప్రదింపులు పత్రాన్ని విడుదల చేసింది.
ఈ కన్సల్టేషన్ పేపర్‌పై వచ్చే నెల 16లోగా అభిప్రాయాలను చెప్పాలని కోరింది.
ప్రస్తుతం స్పెషల్ టారిఫ్, కాంబో వోచర్లు గరిష్ఠంగా ఉన్న 90 రోజులు వ్యాలిడిటీ పెంచడానికి చూస్తోంది.
ప్రస్తుతం వాయిస్, డేటా, SMSలను బండిల్డ్ ప్లాన్ రూపంలో ఇస్తున్నాయి.
దీంతో చాలా మంది వాయిస్ కాల్స్, SMSలు మాత్రమే వినియోగించుకుని డేటా వాడట్లేదు.
చాలా మంది ఇంటర్నెట్ వాడకపోయినా తాము డబ్బులు చెల్లించాల్సి వస్తోందని ఫిర్యాదులు చేస్తున్నారు.
అందుకే ట్రాయ్ విడివిడిగా రీఛార్జ్ ప్లాన్స్ తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
More
Stories
రూ.50వేల పెట్టుబడితో వ్యాపార ఐడియా
యాపిల్స్ ఎక్కువగా తింటే.. ప్రమాదమే!
పుచ్చకాయ రహస్యాలు