Assistant Professor: పీహెచ్డీ అవసరం లేదు..
ఉన్నత విద్యా సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి UGC కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ పోస్టులకు పీహెచ్డీ తప్పనిసరి నిబంధనను తొలగించినట్టు వెల్లడించింది.
ఇకపై ఈ పోస్టులకు పీహెచ్డీ అవసరం లేదని, ఐచ్ఛికమేనని స్పష్టంచేసింది.
ఈ నిర్ణయం జులై 1 నుంచి అమలులోకి వచ్చినట్టు పేర్కొంది.
2018లో పీహెచ్డీని తప్పనిసరి చేస్తూ యూజీసీ నిబంధనలు జారీ చేసింది.
Fill in some text
తాజాగా ఆ నిబంధనలను యూజీసీ సవరించింది.
ఇకపై అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే పీహెచ్డీ డిగ్రీ తప్పనిసరి కాదని తెలిపింది.
ఇక పీహెచ్డీ డిగ్రీలేని ఎంతోమంది అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కలగనుంది.