వావ్... బ్రాండెడ్ పాన్ దర్బార్.. 24 క్యారెట్ల బంగారంతో పాన్.. 

యూపీలోని లక్నోలో ప్రత్యేకమైన పాన్ దర్బార్ లో అనేక వెరైటీల్లో పాన్ లు విక్రయిస్తున్నారు. 

వీటిలో స్వచ్చమైన బంగారంతో అనేక ఫ్లెవర్లలో పాన్ లను తయారుచేస్తున్నారు. 

పెళ్లిళ్లు, ఏ శుభకార్యాలైన కూడా మనలో చాలా మందికి పాన్ లు తినే అలవాటుంటుంది. 

లక్నోలోని నవాబ్స్ నగరంలో అత్యంత ఖరీదైన పాన్ అందుబాటులో ఉంది. 

బ్రాండెడ్ బూట్లు, బ్రాండెడ్ గ్లాసెస్ ల మాదిరిగా ఇక్కడ బ్రాండెడ్ పాన్ లను అమ్ముతుంటారు. 

మాస్టర్ సంజయ్ కుమార్ చౌరాసియా రూపొందించిన ఈ పాన్ లు వివిధ ధరల్లో ఉన్నాయి..

2022 సెప్టెంబర్ 27న తాను ఇక్కడ ఈ దుకాణాన్ని ప్రారంభించానని చెప్పారు.

ఇక్కడ.. చాక్లెట్ పాన్, నవరత్న పాన్, మోదక్ పాన్, స్వీట్ పాన్, రాయల్ పాన్, మలై పాన్, రెడ్ చెర్రీ పాన్, 

హైదరాబాదీ పాన్, గులాబ్ పాన్, మోతీచూర్ చక్నాచూర్ పాన్, సుల్తానీ పాన్ లభిస్తాయి..