వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్.. ఫొటోలివే!

వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌ ఫొటోలను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ xలో షేర్ చేశారు.

ఈ రైళ్లు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి. ఈ రైలుకి 16 కోచ్‌లు ఉంటాయి. 823 ప్రయాణికుల బెర్తులు ఉంటాయి.

ఈ రైళ్లలో అడ్వాన్స్డ్ లైటింగ్, USB ఛార్జింగ్, డాగ్ బాక్స్, ఎక్కువ లగేజ్ స్పేస్ ఉంటాయి.

ఈ రైలులో భారీ, మీడియం, స్మాల్ పాంట్రీస్‌లో తాజా లంచ్, డిన్నర్ అందుబాటులో ఉంటుంది. 

ఈ రైలుకి ఏరోడైనమిక్ క్యాబ్ ఉంది. క్రాష్ బఫర్స్, యాంటీ క్లైంబర్స్ ఉన్నాయి. ఇవి ప్రయాణికులకు ఎక్కువ సేఫ్టీని కలిగిస్తాయి.

ఈ రైలుకి హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండీషనింగ్ (HVAC).. అంతటా ఒకేలాంటి ఎయిర్ కండీషనింగ్ ఇస్తుంది.

ఈ రైలులో బ్లాక్ బాక్స్ ఉంటుంది. అది రియల్ టైమ్ డేటాను క్యాప్చర్ చేస్తుంది. సేఫ్టీ ఎలా ఉందో.. కంటిన్యూగా ఎనాలసిస్ చేస్తుంది. 

ఈ రైలులో విజిలెన్స్ కంట్రోల్ డివైజ్ ఉంది. ఇది ప్రతి నిమిషం డ్రైవర్‌ని అలర్ట్ చేస్తుంది. అలాగే.. ఫైర్ డిటెక్షన్ సిస్టం ఉంది. ఇంకా HL3 సేఫ్టీ వ్యవస్థ ఉంది. 

ఈ రైలులో లోకో క్యాబ్స్ కూడా పూర్తిగా ఏసీతో ఉంటాయి. అలాగే ప్రత్యేక టాయిలెట్స్, రైలు సిబ్బంది కోసం ఉంటాయి. 

ఈ రైలులో 51 ఎర్గోనామిక్ డిజైన్ టాయిలెట్స్ ఉంటాయి. ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు షవర్ ఫెసిలిటీ కూడా కలిగివుంటారు.

ఈ రైలుకి బయో-డైజెస్టర్ ట్యాంకులు, 30 లీటర్ల గార్బేజ్ కాంపాక్టర్స్ ప్రతీ కోచ్‌లో ఉంటాయి. (All Images credit - x - @AshwiniVaishnaw)