లావెండర్: ఇంట్లో ఇది సానుకూల శక్తిని వెదజల్లుతుంది. ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. అందువల్ల బెడ్రూమ్, లివింగ్ రూమ్ వద్ద ఈ మొక్కలను ఉంచాలి.
తులసి: తలసి మొక్క ఇంట్లో ఉంటే అక్కడ లక్ష్మి కొలువై ఉంటుంది. ఇంటి లోపల బయట కూడా ఈ మొక్కను పెంచుకోవచ్చు. వంటింటి కిటీకీపైనా ఉంచవచ్చు.
స్నేక్ ప్లాంట్: ఇది ఫార్మాల్డిహైడ్, బెంజీన్ వంటి టాక్సిన్లను తొలగించడం ద్వారా గాలిని శుద్ధి చేస్తుంది. ఇది ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది. పడకగదిలో ఉంచిదే మంచిది.
రోజ్మేరీ: ప్రతికూల శక్తిని పారద్రోలడానికి ఈ మొక్క పనికొస్తుంది. ఉత్పాదకత, ఏకాగ్రతను పెంచడానికి మీ డెస్క్, వర్క్‌స్పేస్ వద్ద రోజ్మేరీ కుండీని ఉంచాలి.
పీస్ లిల్లీ: ఇది ఇంట్లో ప్రశాంతత, సామరస్యాన్ని నింపుతుంది. ఎంతో అందమైన తెల్లని పువ్వులు గాలిని శుద్ధి చేస్తాయి. ఇంటి ప్రవేశమార్గం వద్ద ఉంచితే బాగుంటుంది.
సేజ్: సేజ్ మొక్కను ఎంతో కాలంగా ధూపంలో వినియోగిస్తున్నారు. ఐతే ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే సానకూల, ఉత్తేజకరమైన వాతావరణం ఉంటుంది.
జాస్మిన్: జాస్మిన్ సానుకూల శక్తిని ప్రసాదిస్తుంది. ప్రతికూలతను తొలగిస్తుంది. ప్రశాంతమైన నిద్ర, మంచి కలలు రావడానికి ఇంట్లో జాస్మిన్ పూల కుండీ ఉంచాలి.