అంతర్జాతీయ క్రికెట్ లో సెంచరీల సెంచరీని పూర్తి చేశాడు సచిన్ టెండూల్కర్.
ప్రస్తుతం ఈ రికార్డు వైపు కింగ్ విరాట్ కోహ్లీ వడివడిగా అడుగులు వేస్తున్నాడు.
ఇప్పటి వరకు కోహ్లీ 76 అంతర్జాతీయ సెంచరీలు బాదాడు.
వన్డేల్లో 46.. టెస్టుల్లో 29.. టి20ల్లో ఒక సెంచరీ సాధించాడు.
సచిన్ వన్డేల్లో 49 సెంచరీలు బాదాడు. ఈ రికార్డుకు కోహ్లీ కేవలం 3 సెంచరీల దూరంలోనే ఉన్నాడు.
అయితే కోహ్లీ వన్డేల్లో నాలుగు దేశాలపై సెంచరీ బాదలేదు.
1 .అఫ్గానిస్తాన్ : రెండు వన్డేలు ఆడిన కోహ్లీ 67 పరుగులు చేశాడు. టి20ల్లో మాత్రం సెంచరీ బాదాడు.
2. నెదర్లాండ్స్ : ఒక మ్యాచ్ ఆడి 12 పరుగులు చేశాడు.
3. ఐర్లాండ్ : 2 మ్యాచ్ లు ఆడాడు. కానీ, సెంచరీ సాధించలేదు
4. యూఏఈ : ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు.