వాహ్.. విరాట్ ! సచిన్ టెండుల్కర్ రికార్డు బ్రేక్ చేసిన కింగ్ కోహ్లీ

క్రికెట్‌లో రికార్డు బ‌ద్ద‌లు.. అనే ప‌దం వింటే స‌చిన్ టెండుల్క‌ర్ గుర్తొచ్చేవాడు

ఇప్పుడు స‌చిన్ రికార్డుల‌నే బ‌ద్ద‌లు కొడుతూ వ‌స్తున్నాడు కింగ్ కోహ్లీ

ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో భాగంగా పాక్‌తో భార‌త్ మ్యాచ్ జ‌రిగింది

ఈ మ్యాచ్‌లో విరాట్ బౌండ‌రీ కొట్టి 14,000 ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు

దీంతో వ‌న్డేల్లో అత్యంత వేగంగా 14 వేల ప‌రుగులు చేసిన బ్యాట‌ర్‌గా నిలిచాడు

అంతేకాదు.. స‌చిన్ టెండుల్క‌ర్ పేరుపై ఉన్న రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు.

స‌చిన్  350 ఇన్నింగ్స్‌ల్లో 14 వేల ప‌రుగులు చేయగా.. కోహ్లీ 287 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘ‌న‌త సాధించాడు

స‌చిన్ మొత్తం 463 మ్యాచ్‌ల్లో 18,426 ప‌రుగులు చేశాడు. ఇందులో 49 సెంచ‌రీలు, 96 ఫిఫ్టీలు ఉన్నాయి.

కోహ్లీ 299 వ‌న్డే మ్యాచ్‌ల్లో 14000 ప‌రుగులు చేశాడు. ఇందులో 50 సెంచ‌రీలు 73 ఫిఫ్టీలు ఉన్నాయి.