గుడిలో టమాటాలతో తులాభారం.. ఆసక్తికరంగా చూసిన భక్తులు..
కొన్నిరోజులుగా టమాటాల ధరలు చుక్కలను చూపిస్తున్నాయి.
ఇప్పటికే వంద దాటేసి రెండు వందలకు చేరువలో ఉన్నాయి.
దీంతో టమాటాలను సీసీ కెమెరాల నిఘాలో విక్రయిస్తున్నారు..
మరికొన్ని చోట్ల ప్రభుత్వాలు సబ్సీడి కింద అక్కడక్కడ టమాటాలను అమ్ముతున్నారు.
ప్రస్తుతం చికెన్ కంటే కూడా టమాటాల ధరలు ఎక్కువగా ఉన్నాయి.
విశాఖ పట్నంలోని అనకాపల్లిలోని నూకాలమ్మ ఆలయంలో టమాటాలతో తులాభారం నిర్వహించారు..
అప్పారావు, మోహిని దంపతులు అమ్మవారికి కాస్లీ టమాటాలతో తులాభారం నిర్వహించారు.
తమ ముద్దుల బిడ్డ భవిష్య కోసం ఇలానూకాలమ్మకు మొక్కుకున్నట్లు తెలిపారు..
గుడిలో టమాటాలతో తులాభారం.. ఆసక్తికరంగా చూసిన భక్తులు..