ఏ రాశి వారికి ఏ కలర్ డ్రెస్ మేలు? ఏ కలర్ వాడకూడదు?
మేష రాశి: రెడ్, పర్పుల్, ముదురు పసుపు, మెరూన్ కలర్స్ మేలు. బ్లాక్, వైట్, పింక్ కలర్స్‌కి దూరంగా ఉండాలి.
వృషభ రాశి: బ్లాక్, గ్రీన్, పింక్ స్ట్రాంగ్ కలర్స్. ఎరువు, పర్పుల్ కలర్స్ వాడకూడదు.
మిథున రాశి: ఎల్లో, లైట్ గ్రీన్, వైట్, రోజ్ కలర్స్ వాడితే కలిసొస్తుంది. రెడ్, ఆరెంజ్ కలర్స్‌కి దూరంగా ఉండాలి.
కర్కాటక రాశి: వైట్, గ్రీన్, బ్లూ, ముదురు ఎల్లో కలర్ డ్రెస్సులు వాడొచ్చు. బ్లాక్, తేలికైన పర్పుల్ కలర్ (burgundy) వాడకూడదు.
సింహ రాశి: బ్రౌన్, పర్పుల్, గోల్డ్, ఆరెంజ్ కలర్స్ డ్రెస్సులు వేసుకోవచ్చు. తేలికైన పింక్, లైట్ బ్లూ, వైట్ కలర్స్ వాడకపోవడం మేలు.
కన్య రాశి: గ్రీన్, బ్లాక్, గ్రే, పీచ్ కలర్స్ వాడటం మేలు. రెడ్, ఆరెంజ్ జోలికి వెళ్లకూడదని పండితులు చెబుతున్నారు.
తుల: క్రీమ్, బ్లూ, బ్లాక్, పింక్ కలర్స్ వాడితే కలిసొస్తుంది. మెరిసే నియోన్ కలర్స్ జోలికి వెళ్లకూడదు.
వృశ్చిక రాశి: మెరూన్, వయలెట్, దానిమ్మ రంగు, బ్లాక్ కలర్స్ వాడొచ్చు. వైట్, పింక్ కలర్ డ్రెస్సులు వాడకూడదు.
ధనస్సు రాశి: పర్పుల్, సియన్నా (బ్రౌన్), మిక్స్‌డ్ కలర్ పాట్టెర్న్స్ డ్రెస్సులు వేసుకోవచ్చు. బ్లాక్, పింక్ డ్రెస్సులకు దూరంగా ఉండాలి.
మకర రాశి: బ్లాక్, గ్రే, నేవీ బ్లూ, వైట్ కలర్ డ్రెస్సులు వాడితే బెటర్. ఎల్లో, పర్పుల్, నియోన్స్ (మెరిసే) కలర్స్ జోలికి వెళ్లకూడదు.
కుంభ రాశి: టర్కోయిస్ (Turquoise), సిల్వర్, స్కై బ్లూ, లిలాక్ (lilac) కలర్ డ్రెస్సులు వాడొచ్చు. ఆరెంజ్, గోల్డ్, బ్లూ వాడకకూడదు.
మీన రాశి: లావెండర్, వైట్, బ్లూ, పీచ్ కలర్స్ వీరికి స్ట్రాంగ్ కలర్స్. రెడ్, డార్క్ బ్లూ కలర్స్ వాడకపోవడం మేలు.
Disclaimer: ఇది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదు.
More
Stories
శివుడి పూజా విధానం
ఏ పాము ఎలాంటిది?
యాపిల్, అల్లం టీ