బల్లి పడిన పాలు తాగితే ఏమవుతుంది!

పాలలో బల్లి పడితే అది తాగకూడదని భారతీయ సమాజంలో ఒక నమ్మకం ఉంది.

అయితే అసలు బల్లులు పడిన పాలు తాగితే.. ఎలాంటి ప్రభావం చూపుతుందో చూద్దాం..

నిపుణులు శుభాంగి నిగమ్ ఈ విషయంలో ఓ క్లారిటీ ఇచ్చారు.

బల్లి పడిన పాలు తాగితే చనిపోరని చెప్పారు.

బల్లుల శరీరంలో విషం ఉందనేది నిజం కాదు.

అయితే ఆ పాలు తాగితే.. హాని కలిగించడానికి మరొక కారణం ఉంది.

బల్లి చాలా చోట్ల తిరగడంతో శరీరంపై మురికి పేరుకుపోయింది. పాలలో పడితే పాలు మురికిగా మారుతాయి.

ఈ భయం వల్ల ప్రజలు ఒకవేళా తాగితే ఏమో అవుతుందని భావిస్తారు..

అయితే పాలలో కొంత మురికి ఉండటం వల్ల కడుపు నొప్పి లేదా విరేచనాలు రావోచ్చు.

అంతేకానీ.. చనిపోయే అంత ప్రమాదం మాత్రం ఉండదు..