షుగర్ పేషెంట్స్ ఆల్కహాల్ తాగితే..

ప్రపంచంలో మధుమేహం రోగులు వేగంగా పెరుగుతున్న దేశాల్లో భారతదేశం ఒకటి.

వీరికి తినే ఆహారం, లైఫ్‌ స్టైల్‌లో మార్పులు అవసరం. 

ముఖ్యంగా స్మోకింగ్‌తో పాటు ఆల్కహాల్ డ్రింక్స్ తాగే అలవాట్లు మానేయాలి.

ఆల్కహాల్ తాగినప్పుడు మాత్రం షుగర్ లెవల్స్ హెచ్చుతగ్గులకు గురవుతాయి. 

అదే ఎక్కువ ఆల్కహాల్‌ తాగితే రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. 

కొన్నిసార్లు ఇది ప్రమాదకరమైన స్థాయికి పడిపోతుంది. 

ముఖ్యంగా టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారికి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది.

బీరు, వైన్ వంటి డ్రింక్స్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. 

దీంతో ఇవి తాగినప్పుడు శరీరంలో షుగర్ లెవల్స్ వేగంగా పెరుగుతాయి.

అలాగే ఆల్కహాల్‌కు ఆకలిని ప్రేరేపించే లక్షణం ఉంటుంది. 

దీంతో అతిగా తినాలనే కోరిక కలుగుతుంది. 

ఫలితంగా షుగర్ లెవల్స్‌ పెరగవచ్చు.. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతినవచ్చు. 

గమనిక.. ఇది సోషల్ సమాచారం మాత్రమే. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి.