గుడికి వెళ్తే ప్రశాంతంగా ఎందుకు ఉంటుందో తెలుసా..?
ప్రతి ఒక్కరూ ఎన్ని పనులున్నప్పటికీ ఏదో ఒక రోజు వీలుచూసుకొని గుడికి వెళుతుంటారు.
దీనివల్ల తగినంత ఓర్పు, మానసిక ప్రశాంత లభిస్తుందని విశ్వాసం.
మనిషికి, దేవుడికి మధ్య వారధి గుడి. గుడికి వెళ్లగానే తెలియకుండా మనసు ప్రశాంతంగా మారిపోతుంది.
భూమిలో ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తుంటాయో అక్కడే ఆలయాలన్నీ ఉంటాయి.
ఉత్తర దక్షిణ ధృవాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాసయ్యేచోట ప్రసిద్ధ దేవాలయాలన్నీ ఉన్నాయి.
అందుకే గుడిలో అడుగు పెట్టగానే శరీరం, మనసు ప్రశాంతతను పొందుతాయి.
దేవాలయ గర్భ గుడిలో మూలవిరాట్టును నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన పంచలోహా యంత్రాన్ని నిక్షిప్తం చేసి ఉంచుతారు.
పంచలోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది.
అందుకే గర్భగుడిలో ఎక్కువగా పంచలోహాలను ఉపయోగిస్తారు.
ఆ విధంగా లోహం గ్రహించిన ఆకర్షణను పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది.
రోజూ గుడికి వెళ్ళి మూల విరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారి శరీరంలోకి ఆ తరంగాలు ప్రవేశించి ఆరోగ్యంగా ఉంచుతాయి.
More
Stories
రూ.50వేల పెట్టుబడితో వ్యాపార ఐడియా
యాపిల్స్ ఎక్కువగా తింటే.. ప్రమాదమే!
పుచ్చకాయ రహస్యాలు