ఫోన్‌కి రోజుకు ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టాలో తెలుసా?
ఫోన్స్ విషయంలో చాలా మంది చాలా రకాల తప్పులు చేస్తుంటారు.
వాటిలో ముఖ్యమైనది దానికి ఛార్జింగ్ పెట్టడం. అసలు రోజులో ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టాలి?
ఎంత శాతం వరకు ఛార్జింగ్ పెట్టాలి అనేది చాలా మందికి తెలియదు.
ఫోన్ ఛార్జింగ్ పెట్టే సమయంలో కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే.. బ్యాటరీ పాడవ్వకుండా ఉంటుంది.
చాలా మంది ఫోన్ బ్యాటరీ డౌన్ అయ్యే వరకు యూస్ చేస్తుంటారు.
బ్యాటరీని 20% కంటే తక్కువగా ఉండకుండా చూసుకోవాలి.
మరికొందరు ఫోన్‌లో 100 శాతం కంటే కొంచె ఛార్జింగ్ తగ్గినా సరే వెంటనే ఛార్జింగ్ పెట్టేస్తుంటారు.
ఫోన్‌ను తరచుగా ఛార్జింగ్ పెడుతూ ఉంటే, కాలక్రమేణా ఫోన్ బ్యాటరీ చెడిపోతుంది.
ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ 100 శాతం పూర్తైన వరకు కాకుండా 80 నుంచి 90 శాతం మధ్యలో ఉన్నప్పుడు ఛార్జింగ్ తీసేయాలి.
ఫోన్ ఛార్జింగ్ విషయంలో 20-80 నియమం పాటించాలని చాలా మంది టెక్ నిపుణులు అంటుంటారు.
బ్యాటరీని 20% వరకు ఖాళీ చేసినప్పుడు దానిని ఛార్జింగ్‌లో పెట్టాలి. 80% ఛార్జ్ అయినప్పుడు దాన్ని తీసివేయాలి.
More
Stories
రూ.50వేల పెట్టుబడితో వ్యాపార ఐడియా
యాపిల్స్ ఎక్కువగా తింటే.. ప్రమాదమే!
పుచ్చకాయ రహస్యాలు