ఏ టూత్‌పేస్ట్ సరైనది? ఏది కొనాలి?
మన శరీరంలో స్వయంగా చికిత్స చేసుకోలేనివి దంతాలు మాత్రమే. అందుకే మనం టూత్‌పేస్ట్ వాడుతాం.
మార్కెట్‌లో చాలా బ్రాండ్‌ల టూత్‌పేస్ట్‌లు ఉన్నాయి. మరి వాటిలో ఏది బెస్ట్ అనే ప్రశ్న మీలో ఉంటుంది.
దంతాలు పాలలా మెరవాలి. పెద్దలతోపాటు పిల్లలకు కూడా మేలు చేసే టూత్ పేస్టు ఏది?
మీరు సరైన టూత్‌పేస్ట్‌ని ఎంచుకుంటే, మీ దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.
దంత నిపుణుల ప్రకారం, ఉత్తమ టూత్‌పేస్ట్ అనేది రుచి కంటే, దానిలోని పదార్థాలపై ఆధారపడి ఉంటుంది.
మీరు టూత్‌పేస్ట్ కొనేటప్పుడు దాని రంగు, ధర, రుచి, అట్టపై లుక్ చూసి డిసైడ్ చేసుకోవద్దు.
టూత్‌పేస్ట్ లోని PPMని తనిఖీ చేయండి. PPM అనేది టూత్‌పేస్ట్‌లో సోడియం ఫ్లోరైడ్ ఎంత ఉందో చెబుతుంది.
మీ టూత్‌పేస్ట్‌లో 1500 పార్ట్స్ పెర్ మిలియన్ (PPM) కంటే తక్కువ ఫ్లోరైడ్ ఉంటే అది మీ దంతాలకు సురక్షితం.
సోడియం లారిల్ సల్ఫేట్ లేని టూత్‌పేస్ట్‌ని మీరు ఎంచుకోవాలి. అది ఉత్తమ టూత్‌పేస్ట్.
పిల్లలకు, 1000 PPM కంటే తక్కువ ఉన్నది తీసుకోవాలి, 500 PPM పిల్లలకు ఉత్తమమైనది.
ఇది సాధారణ సమాచారం. అందరికీ ఒకేలా వర్తించకపోవచ్చు. నిపుణుల సలహాలతో నిర్ణయం తీసుకోండి.
More
Stories
ఈ 5 అనారోగ్యాలు పోవాలంటే... రోజూ నెయ్యి వాడాలి
సొరకాయ గింజలు, ధనియాలను ఇలా తీసుకోండి... సంతాన సాఫల్య సిద్ధి
బల్లి వాస్తు