పుట్టిన రోజునాడు క్యాండిల్స్ ఎందుకు ఊదుతారు..!
బర్త్ డే అనగానే కేక్, క్యాండిల్స్ గుర్తొస్తాయి.
దశాబ్దాలుగా పుట్టిన రోజునాడు చాలా మంది క్యాండిల్స్ ఊది, కేక్ కట్ చేస్తుంటారు.
దీని వెనుక అర్థం ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం.
పుట్టినరోజు నాడు కేక్ కట్ చేయడం అనే సంప్రదాయం జర్మనీలో పుట్టింది.
ఇక కొవ్వొత్తులను మొదట ఉపయోగించింది గ్రీకులు.
ఆర్టెమిస్ దేవతను గ్రీకులు పూజించేవారు.
పూజ సమయంలో గుండ్రని కేకుపై క్యాండిల్స్ వెలిగించేవారట.
క్యాండిల్స్ నుంచి వచ్చే వెలుగు చంద్రుని కాంతికి ప్రతీకగా భావించేవారు.
క్యాండిల్స్ ఊదినపుడు వచ్చే పొగను గ్రీకులు పవిత్రంగా భావించేవారు.
తమ ప్రార్థనలు పొగద్వారా తమ దేవత అయిన ఆర్టెమిస్‌కు చేరతాయని వారి నమ్మకం.
అప్పటి నుంచి కేక్ కట్ చేసినప్పుడు క్యాండిల్స్ ఊదడం ప్రారంభమైంది.
More
Stories
లిచీ పండ్లు ఎక్కువగా తింటున్నారా
కమ్మని పెరుగు కావాలా?
బరువు తగ్గాలంటే..