కొత్త బైక్ కొంటున్నారా? ఇది తప్పక తెలుసుకోండి

కొత్త బైక్ కొనగానే రయ్యిన దూసుకుపోవడం మనకు అలవాటు. ఐతే, ఓ విషయం మర్చిపోకూడదు.

మీ కొత్త బైక్ ఎక్కువ కాలం మన్నాలంటే, సంవత్సరాల తరబడి రావాలంటే మీరు దాన్ని నెమ్మదిగానే నడపాలి.

కొత్త బైక్‌పై ప్రారంభంలో ఎకానమీ వేగంలో వెళ్లాలి. అంటే గంటకు 40-50కి.మీ వేగంతోనే వెళ్లాలి.

ఎకానమీ వేగంతో వెళ్లేటప్పుడు బైక్ పెట్రోల్ తక్కువ తీసుకుంటుంది. తద్వారా ఎక్కువ మైలేజీ వస్తుంది.

మీ బైక్‌ స్పీడోమీటర్‌ని గమనిస్తే, అందులో మీ బైక్ ఎకానమీ స్పీడ్ ఎంతో ప్రత్యేకంగా చూపిస్తుంది. ఆ వేగంతో వెళ్లొచ్చు.

కొత్త బైక్‌లో పనిముట్లు పద్ధతిగా పనిచెయ్యడానికి కొంత సమయం పడుతుంది. ప్రారంభంలో అవి సరిగా పనిచెయ్యవు.

కొన్న కొత్తలో నెమ్మదిగా వెళ్లడం వల్ల పనిముట్లు రాపిడి చెంది.. క్రమంగా సరైన పద్ధతిలోకి సెట్ అవుతాయి. ఇందుకు కొంత టైమ్ తీసుకుంటాయి.

అదే అతి వేగంతో వెళ్తే.. కొత్త పనిముట్లు అతి రాపిడి వల్ల పాడయ్యే ప్రమాదం ఉంటుంది. అదే జరిగితే బైక్ త్వరగా పాడైపోతుంది.

కొత్త బైక్‌ని ఎకానమీ స్పీడ్‌తో నడిపినప్పుడు అందులోని లూబ్రికెంట్ అన్ని భాగాలకూ చక్కగా వ్యాపిస్తుంది. 

బైక్‌ని ఎకానమీ వేగంతో ఎంతకాలం నడపాలి అనేది సాధారణంగా 1000-2000 కిలోమీటర్ల మధ్య ఉంటుంది.

ఎకానమీ కాలం ముగిసిన తర్వాత కంపెనీ మొదటి సర్వీస్ కోసం పిలుస్తుంది. బైక్‌ని పరిశీలించి తగిన సూచనలు చేస్తుంది.