గుడిలో దర్శనం అయ్యాక ఎందుకు కూర్చుంటారో తెలుసా..?
ప్రతి ఒక్కరూ ఎన్ని పనులున్నప్పటికీ ఏదో ఒక రోజు వీలుచూసుకొని గుడికి వెళుతుంటారు.
దీనివల్ల తగినంత ఓర్పు, మానసిక ప్రశాంత లభిస్తుందని విశ్వాసం.
దేవుడ్ని దర్శించగానే మనలోని కోపమూ, అహమూ, ఆవేశమూ, స్వార్ధ చింతన ఆ కొంతసేపూ దూరమవుతాయి.
గుడికి వెళ్లగానే తెలియకుండా మనసు ప్రశాంతంగా మారిపోతుంది.
భూమిలో ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తుంటాయో అక్కడే ఆలయాలన్నీ ఉంటాయి.
గుడిలో దేవుడిని దర్శించుకున్న తర్వాత చాలా మంది గుడి ప్రాంగణంలో కూర్చుంటారు.
గుడి నుంచి బయటకు వచ్చిన వెంటనే జనారణ్యం లోకి వెళితే మళ్ళీ మన మనసు మనల్ని యథావిధిగా నడిపిస్తుంది.
దర్శనం అవ్వగానే కొంతసేపు గుడిలో కూర్చుంటే దేవాలయంలో చేసే యజ్ఞ, యాగాది, పూజల ప్రతిఫలం కారణంగా మనసులోని మాలిన్యం కరగడం ప్రారంభమవుతుంది.
అలా కొంతయినా ఆరోగ్యకరమైన, ఆహ్లాద కరమైన సమయాన్ని గడపగలుగుతాము.
అందుకే పెద్దలు గడిలో కూర్చోవాలి ఉంటారు.
దీంతో పాటుగా గుడిలో ఉండే పాజిటివ్ ఎనర్జీ శరీరంలోకి ప్రవహించి ఆరోగ్యం కలుగుతుందని సైన్స్ చెబుతోంది.
More
Stories
రూ.50వేల పెట్టుబడితో వ్యాపార ఐడియా
యాపిల్స్ ఎక్కువగా తింటే.. ప్రమాదమే!
పుచ్చకాయ రహస్యాలు